
మంత్రి తుమ్మలకు రక్తపు వాంతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంత కాలంగా అల్సర్ సమస్యతో బాధపడుతున్న మంత్రి తుమ్మలకు రక్తపు వాంతులు అయ్యాయి.
యశోదా ఆస్పత్రిలో డాక్టర్. ఎంవీ రావు మాట్లాడుతూ.. మంత్రి తుమ్మలకు రక్తంతో కూడిన వాంతులు అయినట్లు తెలిపారు. మంత్రికి బీపీ తగ్గించి బ్లీడింగ్‌ను అదుపు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తుమ్మలకు ఎలాంటి సమస్య లేదన్నారు. అయితే పూర్తిగా కోలుకునేందుకు మరో రెండ్రోజుల పాటు ఆయనను ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందించనున్నట్లు వివరించారు.