సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్యనేతలు శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తుమ్మల నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు వెళ్లి మంతనాలు సాగించారు.
ఈ సందర్భంగా తుమ్మలను ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. తుక్కుగూడ విజయభేరీ సభలో పార్టీలో చేరాలని సూచించారు. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్న తుమ్మల ఇక రేపో మాపో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనిపిస్తోంది.
రేపు తాజ్ కృష్ణా హోటల్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌లో జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
చదవండి: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ..
Comments
Please login to add a commentAdd a comment