సాక్షి, ఢిల్లీ: ఖమ్మం కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఓ కొలిక్కి వచ్చాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పోటీ చేయబోయే స్థానాలపైన స్పష్టత వచ్చింది. పాలేరు పొంగులేటి, ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది.
ఈ ఇద్దరు నేతలు ఇవాళ(అక్టోబర్ 14, శనివారం) ఢిల్లీ వెళ్లి అగ్రనేతల్ని కలిశారు. అయితే.. రాహుల్ గాంధీ సూచన తర్వాత తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది.
వామపక్ష పార్టీల పొత్తుపై..
వామపక్షాల పొత్తు అంశంపై కేసీ వేణుగోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి, ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు, అలాగే సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment