
మంత్రి తుమ్మల, తల్లి మాణిక్యమ్మ(ఫైల్)
దమ్మపేట(ఖమ్మం): 'నాకు 12 ఏళ్ల వయసులోనే నాన్న చనిపోతే.. అమ్మే(మాణిక్యమ్మ) నన్ను పెంచి పెద్ద చేసింది. రాజకీయంగా ఏ పని చేపట్టాలన్నా అమ్మకు పాదాభివందనం చేయడం నాకు అలవాటు. ఏ స్థాయిలో ఉన్నా.. అమ్మ కష్టపడి నా కుటుంబ సభ్యులను పెంచిన తీరును నేను ఎన్నడూ మరచిపోలేను. ఆమె ఉన్నంత వరకు నా ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకునేది. సమయానికి భోజనం చేస్తున్నావా అని అడిగేది.
ఆమె కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మ నన్ను నడిపోడు అనే పిలిచేది. రాజకీయంగా ఎంత బిజీ అయినా.. నాకు తెలిసినంత వరకు అమ్మ మాటను ఏనాడూ జవదాటలేదని' మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమ్మతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.