
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే తన కల అని మనసులో మాటను ప్రజలకు చెప్పుకొచ్చారు.
కాగా, తుమ్మల నాగేశ్వర రావు నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే అభివృద్ధి చేశాను. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి అభివృద్ధి చేశాను. రైతుల కోసం పాలేరు పాత కాలువకు రూ.70కోట్లతో రిపేర్ చేయించాను. రైతు బాగుంటేనే అందరం ఆనందంగా ఉంటాం. ఆనాడు నేను చేసిన అభివృద్ధితో పాలేరు అత్యంత ఖరీదైన ప్రాంతంగా నిలిచింది.
వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను. గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే నా కోరిక. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకే నేను పోటీ చేస్తున్నాను. శాశ్వత ప్రాతిపదికన తప్ప తాత్కాలిక కార్యక్రమాల ద్వారా ప్రజలు బాగుపడరు. నేను పోటీలో నిలుస్తున్నాను.. ఈసారి సీపీఐ సహా పలు పార్టీలు నేతలు మద్దతిస్తున్నారు. మీ మనసులో కోరిక, ఈ ప్రాంత ప్రజల కోరిక తీరాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment