ఖమ్మం : అంగన్‌వాడీ సిబ్బందిపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం ముకుందాపురం గ్రామంలో మంత్రి తుమ్మల సోమవారం ఉదయం పర్యటించారు. ముకుందాపురం నుంచి ఆసన్నగూడెం గ్రామం వరకు రూ.1.96 కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ స్కూల్‌ను సందర్శించారు. నిర్వహణ సరిగా లేకపోవడం, రికార్డుల్లో వివరాలను సరిగా పొందుపరచకపోవడాన్ని గుర్తించిన తుమ్మల అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్ కవిత, ఉన్నతాధికారులు పలువురు ఉన్నారు.
(దమ్మపేట)