పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్‌ | Ex CM KCR Telangana Three Districts Tour Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్‌

Published Sun, Mar 31 2024 10:19 AM | Last Updated on Sun, Mar 31 2024 1:21 PM

Ex CM KCR Three Districts Tour Live Updates - Sakshi

Live Updates..

జనగామ జిల్లాలో కేసీఆర్‌ బస్సు తనిఖీ..
ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో కేసీఆర్‌ బస్సులో పోలీసుల తనిఖీలు
తనిఖీ అనంతరం మళ్లీ బయలుదేరిన కేసీఆర్‌. 

జనగామ జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన కేసీఆర్

  • అలాగే, రైతులను పరామర్శించిన కేసీఆర్‌
  • రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
  • కాసేపట్లో తిరుమలగిరి మండల కేంద్రం చేరుకోనున్న కేసీఆర్ అటు నుంచి అర్వపల్లి మండలం వెలుగుపల్లిలో ఎండిన పంటల పరిశీల‌న 
  • అనంతరం, పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్న కేసీఆర్
  • తిరుమలగిరి, అర్వపల్లిలో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకున్న కేసీఆర్

పంట పొలాలను పరిశీలించేందుకకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ నుంచి కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. 

అయితే, రాష్ట్రంలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ రైతులను కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు.

కేసీఆర్‌ పర్యటన ఇలా.. 
ఈరోజు ఉదయం 10:30 గంటలకు చేరుకుని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్‌ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ రెండు గంటలకు భోజనం చేసి  మూడు గంటలకు మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి 4.30కు నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు.    


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement