janagoan
-
కడియం.. దమ్ముంటే రాజీనామా చేయ్: రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొంద రాజయ్య. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే, హింసించే పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మారిన నేతలకు దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు.కాగా, స్టేషన్ ఘనపూర్‌లో శనివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంభించింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన గుండాలను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి అని కూడా చూడకుండా హరీష్ రావును తీసుకెళ్లడం దారుణం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన శాంతియుతంగా జరిగింది.కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. ప్రజలను హింసించే పాలన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చేర్చారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో, కోడి గుడ్లతో కొట్టండని రేవంత్ రెడ్డే చెప్పారు. నాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచాను.నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ముందు రాజీనామా చేయాలి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. హైకోర్టు బెంచ్, సుప్రీం కోర్టుకు వెళ్తా అనడం సిగ్గుచేటు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. జనరల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని అనేక సార్లు చెప్పిన కడియం.. దీనిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్‌కు చేసింది గుండు సున్నా. బీఆర్ఎస్ తెచ్చిన రైతుబంధును రైతుభరోసాగా మార్చారు. రైతుభరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: డీసీపీ ఫిర్యాదు..కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు -
పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్
Live Updates.. జనగామ జిల్లాలో కేసీఆర్ బస్సు తనిఖీ.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు తనిఖీ అనంతరం మళ్లీ బయలుదేరిన కేసీఆర్. ►జనగామ జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన కేసీఆర్ అలాగే, రైతులను పరామర్శించిన కేసీఆర్ రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో తిరుమలగిరి మండల కేంద్రం చేరుకోనున్న కేసీఆర్ అటు నుంచి అర్వపల్లి మండలం వెలుగుపల్లిలో ఎండిన పంటల పరిశీలన అనంతరం, పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్న కేసీఆర్ తిరుమలగిరి, అర్వపల్లిలో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు ►జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకున్న కేసీఆర్ ►పంట పొలాలను పరిశీలించేందుకకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ►అయితే, రాష్ట్రంలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ రైతులను కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. కేసీఆర్ పర్యటన ఇలా.. ►ఈరోజు ఉదయం 10:30 గంటలకు చేరుకుని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ►మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ రెండు గంటలకు భోజనం చేసి మూడు గంటలకు మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి 4.30కు నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్.. గులాబీ నేతలకు కేసీఆర్, కేటీఆర్ వార్నింగ్
గులాబీ తోటలో స్టేషన్ ఘన్పూర్ పంచాయతీకి తెర పడిందా? కొన్నాళ్లుగా మాటల యుద్ధం చేసుకుంటున్న కడియం, రాజయ్యలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా? లేక ఇద్దరి మధ్యా రాజీ కుదిరిందా? సీటు విషయంలో ఎవరిది పై చేయి అయింది? ఇంకొకరికి ఎటువంటి హామీ లభించింది? ఇకముందు ఇద్దరూ సైలెంట్‌గా ఉంటారా? మరోసారి రెచ్చిపోతారా?.. తెలంగాణలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల సీటు వివాదం కొత్తమలుపు తిరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యా సాగుతున్న డైలాగ్‌వార్‌కు పార్టీ నాయకత్వం చెక్ పెట్టింది. ఇద్దరినీ హైదరాబాద్‌కు పిలిపించి పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సున్నితంగా మందలించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అటు కేసీఆర్‌ను ఇటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. కేటీఆర్‌ను కలిసిన రాజయ్య రాజయ్య మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాత్రమే కలిసారు. తొలి నుంచీ రాజకీయ ప్రత్యర్థులైన కడియం, రాజయ్యలు బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా అదే పోకడ కొనసాగించారు. డిప్యూటీ సీఎంలుగా ముందు రాజయ్యకు, తర్వాత కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా పోరు తీవ్రంగా సాగుతోంది. ఇంకా ముదిరితే పార్టీకే నష్టమని పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ అధిగమించవద్దని ఇద్దరినీ సున్నితంగా మందలించి పంపింది. రాజయ్య అవినీతిపై కడియం వివరణ.. హైదరాబాద్ నుంచి పిలుపు రాగానే హడావుడిగా వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంతకు రెండు రోజుల ముందు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, కేటీఆర్‌ను కలిసారు. తాను కడియంపై కొత్తగా ఏమీ ఆరోపణలు చేయలేదని, గతం నుంచి ఆయన మీద ఉన్నవేనని రాజయ్య.. కేటీఆర్‌కు వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా రాజయ్య అవినీతి గురించి కడియం పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చి.. ఎవరి భవిష్యత్ అయినా కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే స్టేషన్‌ఘన్‌పూర్ సీటు విషయంలో ఈసారి కడియం శ్రీహరి పోటీ చేయడానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. స్పీడ్ పెంచిన శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్న కడియం తన నియోజకవర్గంగా స్టేషన్ ఘన్‌ఫూర్ ఎంపిక చేసకుని.. మరింత దూకుడుగా వ్యవహరించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యకు బదులుగా ఈసారి కడియం శ్రీహరి వైపు గులాబీ దళపతి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సభలు, సమావేశాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న కడియం నియోజకవర్గంలో తన ఫ్లెక్సీల కోసం మండలానికి 10 లక్షలు చొప్పున పంపిణీ చేశారన్న టాక్ నడుస్తోంది. కడియం, రాజయ్య మధ్య వివాదం తీవ్రం కావడంతో జనగామకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని తెరమీదకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నియోజకవర్గానికి చెందిన సీఎం ముఖ్య అనుచరుడు ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ ఎంట్రీ.. ఘన్పూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుగొనే పనిలో పార్టీ అధిష్టానం నిమగ్నమయిందట. అసలు విషయం తేల్చకుండా ఇంతకాలం కలిసి పనిచేసుకోండని చెప్పినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. ఇద్దరి మధ్య మరో ఎమ్మెల్సీ ఎంట్రీ కారణంగానే ఘన్పూర్ అడ్డా అధికార పార్టీలో రాజకీయ దుమారం చెలరేగిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. టిక్కెట్ విషయంలో వెంటనే స్పష్టత ఇచ్చి..పార్టీ ఐక్యత దెబ్బతినకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఘన్పూర్ గులాబీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి. ఇది కూడా చదవండి: చంద్రబాబు వారసుడు రేవంత్ -
జనగామలో హై టెన్షన్.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
సాక్షి, జనగామ: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా జనగామలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ నేతలు రాళ్లు విసురుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వేడి ఇంకా తగ్గలేదు. తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచార హోర్డింగ్స్ పెట్టాయి. బండి సంజయ్‌కు సవాల్ విసరురూ టీఆర్ఎస్ నేతలు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫారసు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. కాగా, రెండు పార్టీల ఫ్లెక్సీలతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: పాతికేళ్ల లక్ష్యాలు ఘనం మరి.. గత హామీల సంగతి?: కేటీఆర్ -
11 రాష్ట్రాల సీఎంలు షాక్ అయ్యారు: కేసీఆర్
-
జనగామ జిల్లా కేంద్రలో ఉద్రిక్త పరిస్థితులు
-
జనగామ: ఏసీ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎక్కుతుండగా ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరిని కిందకు దింపేశాడు. దీంతో బస్సులో ప్రాయణిస్తున్న 29 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. -
నేతల వద్దకు ఆశావహులు
సాక్షి, జనగామ : నేడో రేపో మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహులు నేతల వద్దకు క్యూ కడుతున్నారు. అవకాశం కలిసొస్తే పోటీకి తాము సిద్ధమేనంటూ వర్తమానం పంపుతున్నారు. తమ పార్టీ నేతలను కలిసి ఫలనా వార్డు నుంచి తమకు చాన్స్ దక్కేలా చూడాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలను మొదలు పెడుతున్నారు. ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడితో పోరుగడ్డ జనగామలో పొలిటికల్ హీట్ పెరుగుతోం ది. పురపాలక ఎన్నికలను ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతుండగా ఆశావహుల ప్రయత్నాలతో రాజకీయ సందడి మొదలైంది. నేతల వద్దకు ఆశావహులు.. జనగామ మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వార్డుల పునర్విభజన, ఓటర్ల ముసాయిదా, ఓటర్ల కుల గణన ఓటర్ల జాబితా విడుదల చేశారు. దీంతో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు వార్డుల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉండే వార్డు ఏది, తమ సామాజిక ఓటర్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోటీ కోసం తహతహలాడుతున్న ఆశావహులు తమ పార్టీ నేతలను తరచూ కలుస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. ఒక్కొక్క వార్డు నుంచి ముగ్గురు, నలుగురు చొప్పున పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పోటాపోటీగా ఓటర్ల నమోదు.. మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆశావహులు తమకు సంబంధించిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించినప్పటికీ నూతన ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని కల్పించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా ఏడు రోజుల ముందు వరకు ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఆశావహులు తమ వార్డుల్లో నూతన ఓటర్లను చేర్పించడం కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని సైతం పట్టణంలోని ఇంటి నంబర్లతో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నట్లు సమాచారం. తాము చేర్పించే వారికే ఓటు హక్కు వస్తే తమకు అనుకూలంగా ఫలితం వస్తుందనే ముందుచూపుతో ఓటర్లగా నమోదు చేయించడానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం సన్నద్ధం.. మునిసిపాలిటీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సమీక్షను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. రాబోయే మునిసిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో ఆ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇప్పటికే బీజేపీ సైతం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు. పార్టీ సమావేశాల్లో ఆశావహులు తమ నేతల మదిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
రూ.5 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, జనగామ : హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న షిఫ్టు కారు(ఏపీ 37 సీకే 4985)ను తనిఖీ చేశారు. వెనక సీటు కింద నగదు కట్టలను పోలీసులు గుర్తించారు. జనగామ మండలంలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్టు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కారులో తరలిస్తున్న డబ్బు దాదాపు రూ.5 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి నగదు వివరాలను వెల్లడించాల్సి ఉంది. స్థానిక పోలీస్టేషన్ లో ఎలక్షన్ కు సంబంధించిన అన్ని శాఖల అధికారుల సమక్షంలో యంత్రాల సహాయంతో డబ్బును లెక్కిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అస్తిత్వ జెండాకు ‘జన’ వందనం
తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కేసీఆర్ జనగామ ఉద్యమ భూమిని కూడా పరిగణనలోనికి తీసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించినట్టు అవుతుంది. భూసంస్కరణలను అమలు జరపాలని ప్రపంచానికి సందేశం ఇచ్చిన జనగామను సీఎం గుండెల్లో దాచుకుని, జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్ష. తెలంగాణలో జనగామ ప్రాంతానిది ప్రత్యేక చరిత్ర. ఈ ప్రాంతానికి ఒక్క పోరాట చరిత్రే కాదు, గొప్ప సాంస్కృ తిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడి ప్రజలు పెద్దగా ధన వంతులు కాకపోవచ్చు. కానీ వివేకవంతులు. వస్తువు, భాష, ఛందస్సులలో నవ్య త్వాన్ని చాటి, ఉత్పత్తి కులాలకు సాహిత్యంలో స్థానం కల్పించిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడి వారే. ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ ఆయన స్మర ణీయ కృతులు. ఇవాళ తెలంగాణ ఆయనను తొలి కవిగా ఆదరిస్తున్నది. ఆయన చేపట్టిన ప్రక్రియలు సాహితీరంగాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. ధన, కనక, వస్తువాహనాలకు ఆశించకుండా తను రాసిన భాగవతాన్ని నరాంకితం చేయకుండా, నారా యణునికి అంకితం చేసిన పోతనామాత్యుడు జన్మించిన బమ్మెర ఇక్కడిదే. వీరికి స్ఫూర్తిగా నిలిచారా అన్నట్టు పాలకుర్తిలోని గుట్ట మీద రెండు గుహల్లో శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వాములు స్వయంభువులుగా వెలసి అనాదిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. వాల్మీకి క్షేత్రంగా భావించే ‘వల్మికి’ ఈ ప్రాంతంలోనిదే. ఒకే పాదులో మొలిచినట్టుగా శైవ, వైష్ణవాలు; అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా సోమన, పోతన నిలవడం కాల ప్రభావమే. ఈ మహా కవుల సాంస్కృతిక ప్రభావమే, వారసత్వమే చుక్క సత్తయ్య వంటి ఒగ్గు కథ కళాకారులకు స్ఫూర్తినిచ్చిందనుకుంటాను. అంపశయ్య నవీన్ వంటి అభ్యుదయ రచయిత, సి. రాఘవాచారి వంటి పాత్రికేయులు ఈ మట్టి కన్నబిడ్డలే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనను వికేంద్రీక రించవచ్చు గాని, ప్రజా సంస్కృతినీ, చరిత్రనూ వికేంద్రీ కరించలేము. అక్కడి భౌగోళిక పరిస్థితులు వారి మధ్య సంబంధాలను సమన్వయం చేస్తాయి. సామాజిక నేప థ్యానికీ, సంస్కృతికీ సమన్వయం కుదిరినప్పుడే సంబం ధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి. రెండూ వేర యితే సంఘర్షణాత్మక ధోరణే మిగులుతుంది. అది శాంతికి భంగకరమూ కావచ్చు. దేవులపల్లి వెంక టేశ్వరరావు వంటి కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ‘జనగామ ప్రజల వీరోచిత పోరా టాన్ని’ గురించి ప్రత్యేక గ్రంథమే వెలువరించారు. జనగామ ప్రాంతమంటే చాకలి ఐలమ్మ బువ్వ గింజల పోరాటం గుర్తుకు వస్తుంది. ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి దొరతనాన్ని ఎదిరించి అమరుడైన బందగీ భూమి పోరాటం తలపునకొస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పి నేలకొరిగిన దొడ్డి కొమరయ్య వంటి వీరుల అమరత్వం కళ్ల ముందు కదలాడుతుంది. జనగామ ప్రాంతం చేసిన పోరాటం వల్లనే దున్నేవానికే భూమి అన్న నినాదం ఎగిసిపడింది. అది భారతదేశంలో జరిగిన పోరాటాలకు కేంద్ర బిందువయింది. భారతదేశంలో భూసంస్కర ణలు రావడానికి జనగామ భూపోరాటమే కారణం. పాలనా సౌలభ్యానికీ, ప్రజావసరాలు తీర్చడానికీ, పాలనా యంత్రాంగం ప్రజలకు అందుబాటులోకి రావ డానికీ జిల్లాల వ్యవస్థ ఏర్పాటైంది. నిజాం పాలనలో జమాబందీతో పాటు జిల్లా బందీని ఏర్పాటు చేసి పాలించారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణను 24 జిల్లాలను చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనను తెలంగాణ సమాజం ఆహ్వానిస్తున్నది. గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలకు భిన్నంగా కేసీఆర్ ప్రతి అంశంలోను నూతన ఒరవడితో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ తెలంగాణ సమా జానికి అవసరమైనవే. ఆ ఫలితాలన్నీ భవిష్యత్ సమా జం అనుభవించడం ఖాయం. తెలంగాణ రాష్ట్రం ఉద్య మాల ద్వారా వచ్చింది. రాజకీయ ప్రక్రియను చేపట్టిన కేసీఆర్ పట్టు వదలకుండా పోరాడి తెలంగాణ విష యంలో గెలిచారు. అందుకే జిల్లాల వ్యవస్థలో మార్పులు చేసే సమయంలో ప్రజల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బ్యూరోక్రసీకి ఈ నిర్ణయాన్ని వదిలిపెడితే గూగుల్ నెట్ వర్క్ పెట్టుకుని భూమ్మీద గీతలు గీసి 24 జిల్లాల స్వరూపాన్ని తేల్చేస్తారు. ఒక జిల్లాను ఏర్పాటు చేసే టప్పుడు ఆ నేలకు ఉన్న స్వభావాన్ని, ప్రజా పోరాటాల సామ్యాన్ని, సామాజిక, సాంఘిక నేపథ్యాలని, సంస్కృ తిని దృష్టిలో పెట్టుకుంటే ప్రాంతాల మధ్య స్థానికతను నిలబెట్టినట్టవుతుంది. బ్యూరోక్రసీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేసే కాలం పోయిందని తెలంగాణ ప్రభు త్వమే ఆచరణాత్మకంగా చెబుతోంది. ప్రతి 40 కిలో మీటర్లకు భాష మారుతుంది. అలాగే భౌగోళికంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ దేశంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కేసీఆర్ జనగామ ఉద్యమ భూమిని కూడా పరిగణనలోనికి తీసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించి నట్టు అవుతుంది. కేసీఆర్ ఉద్యమ సమయంలో వంటా వార్పునకు, బతుకమ్మ బోనాల పండుగల రూపాలను ప్రతిష్టించి ఉద్యమాన్ని రగిలించారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం వల్ల భూసంస్కరణలను అమలు జరపండని ప్రపంచానికి సందేశం ఇచ్చిన జన గామ నేలను కూడా ముఖ్యమంత్రి గుండెల్లో దాచుకుని, తాము కోరుకుంటున్నట్టుగా జిల్లాను ఏర్పాటు చేయా లని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జనగామ జిల్లా ఏర్పాటవుతుందని నమ్మకం నాకు ఉంది. ఒకనాడు భూమి పోరు జెండాను పట్టుకున్న పోరు భూమి నేడు తన అస్తిత్వం కాపాడుకోవడానికి తనను ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించమని వేడుకుంటున్నది. - చుక్కా రామయ్య - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు