మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రాంతాల కలెక్టర్లతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి పై ఆరా తీశారు. పంట నష్టం పై నివేదిక సమర్పించాల్సిందిగా కోరారు. ఫార్మ్ పాండ్స్ కాన్సెప్ట్ ను నాలుగు జిల్లాలో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం కింద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. పంట నష్టంపై సర్వే నిర్వహించి.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.