పంట నష్టం.. అప్పుల బాధతో 10 మంది బలవన్మరణం
సాక్షి, నెట్‌వర్క్: వర్షాభావంతో పంటల నష్టం.. అప్పుల బాధతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 8 మంది గుండెపోటుతో మరణించారు.
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిమనగుం టపల్లికి చెందిన నారాయణరెడ్డి(61) రూ.లక్షన్నర వరకు చేసిన అప్పు తీర్చలేక శనివారం పురుగుల మందు తాగాడు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన ఖానాపురం రమేష్ (25).. రూ. 4.5 లక్షల అప్పు తీర్చేమార్గం కనిపించక శనివారం పొలంలో ఉరేసుకున్నాడు.
ఇదే జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌కు చెందిన కడాల వెంకటేష్(42) బోర్లు, పంటల సాగుకు చేసిన రూ. 3 లక్షల అప్పు తీర్చలేక చెట్టుకు ఉరివేసుకున్నాడు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురానికి చెందిన మహ్మద్ బడేసాహెబ్ (44) రూ. 4 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చలేక శుక్రవారం రాత్రి ఉరివేసుకున్నాడు.
ఇదే జిల్లా ఖానాపూరం మండలం చిలుకమ్మనగర్‌కు చెం దిన రేసు రావుులు(45).. పంటలు అంతంత వూత్రంగా ఉండడం, పెళ్లికి ఎదిగిన కూతురు ఉండటంతో దిగులు చెంది ఈ నెల 7న క్రిమిసంహారక వుందు తాగాడు.
ఆదిలాబాద్ జిల్లా కుంటాల సేవాలాల్‌తండాకు చెందిన జాదవ్ దత్తు(50) తన కుమార్తె పెళ్లి కోసం, పంటల సాగు కోసం చేసిన రూ.2.85 లక్షల అప్పు తీర్చలేక పురుగుల మందు తాగాడు.
నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన గోర్గంటి సాయిలు(43) రూ.లక్ష వరకు చేసిన అప్పు తీర్చలేకపోవడం, పంటలు ఎండిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు.
నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం సదర్శాపురానికి చెందిన తుంగపాటి నరేష్ పత్తిసాగు, బావిపూడికతీతకు చేసిన 5 లక్షల అప్పు తీర్చలేక పురుగులమందు తాగాడు.
ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం పంచాయతీ పోచారానికి చెందిన సక్రూ(55) రూ. 7 లక్షల వరకు బ్యాంకు, ప్రైవేటు అప్పులయ్యూరుు. అప్పులు తీరే మార్గం లేక సక్రూ పురుగుల మందు తాగాడు.
ములకలపల్లి మండలం సుబ్బనపల్లికి చెందిన సోయం గోవిందరావు (45).. మల్బరీ సాగుతో ఆర్థిక బాధలు అధికమయ్యాయని, షెడ్డు నిర్మాణానికి 3 లక్షల అప్పు అయిం దని, రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన ఫలితంలేకుండా పోయిందని లేఖ రాసి ఆత్మహత్మకు పాల్పడ్డారు.
గుండెపోటుతో 8 మంది మృతి
పంటల సాగు కోసం చేసిన అప్పులు, పంటలు దెబ్బతినడంతో ఆవేదన చెంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామానికి చెందిన పొనగంటి మొండయ్య(83), సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన రైతు గోనెల పోచయ్య(55), హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకి చెందిన జెట్టి కొమురయ్య(56), రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎలుకగూడకు చెందిన మోకిల కిష్టయ్య(60), మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం గోటూర్‌కి చెందిన కుర్వ బాలప్ప(48), నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లికి చెందిన గట్టుపల్లి వెంకట్‌రెడ్డి(41), ఖమ్మం జిల్లా జగన్నాథపురం పంచాయితీ సండ్రకుంటకి చెందిన కొర్సా నాగేశ్వరరావు (50), నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ రైతు బొజ్జా పుల్లయ్య(70) గుండెపోటుతో మృతి చెందారు.
ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
Published Sun, Oct 11 2015 2:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM
Advertisement
Advertisement