సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. గురు, శుక్రవారాల్లో వరద ప్రభావిత ప్రాం తాల్లో పర్యటించి నష్టం తీవ్రతను తెలుసుకోనుంది. ఈనెల 13 నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్ నగరం తో పాటు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడనుంది. వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1,350 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment