కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూమును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరిశీలించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూమును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరిశీలించారు. నీటి ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతంలో వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. కాలువ వరదతో పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు ఐజయ్య, చరితారెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.