నర్సింహాపురంలో నేలరాలిన మొక్కజొన్న
ఎర్రుపాలెం: అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని నర్సింహాపురం, వెంకటాపురం, నారాయణపురం తదితర గ్రామాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన మొక్కజొన్న పంట దాదాపు 150 ఎకరాల్లో పూర్తిగా నేలరాలింది. అలాగే, మామిడితోటల్లోని పిందెలు, పూత నేలరాలాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, కాపుకొచ్చిన మామిడి పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment