చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఆదివారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఈ వర్షానికి మండలంలోని పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 300 ఎకరాల్లోని మామిడి తోట పూర్తిగా దెబ్బతింది. మామిడి కాయలు నేలరాలాయి. వర్షానికి సుమారు రూ.25 లక్షల పంట నష్టం వాటిల్లింది. వీటితో పాటు కూరగాయల పంటలు కూడా నాశనమయ్యాయి. 10 రేకుల షెడ్లు పాక్షికంగా, బందార్లపల్లి గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమయింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
(రామకుప్పం)
రామకుప్పంలో గాలి, వాన బీభత్సం
Published Mon, Jun 1 2015 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement
Advertisement