Revanth Reddy Tweets Against KCR And KTR On Crop Damage In Telangana - Sakshi
Sakshi News home page

అకాల వర్షాలతో రైతులు ఏడుస్తుంటే.. తండ్రీ, కొడుకులు ఊరేగుతున్నారు: రేవంత్‌ రెడ్డి

Published Wed, Apr 26 2023 12:07 PM | Last Updated on Wed, Apr 26 2023 12:38 PM

Revanth Reddy Tweets Against KCR And KTR On Crop Damage In TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వదలకుండా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి.  కల్లాలపై అరబెట్టిన ధాన్యం వానకు కొట్టుకుపోయి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అకాల వర్షాలతో రైతన్నలు అరిగొస పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదంటూ తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే.. అయ్యా ఔరంగాబాద్‌లో, కొడుకు ప్లీనరీల పేరుతో రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు మానవత్వం ఉందా.. బాధ్యత ఉందా.. ఇది ప్రభుత్వమేనా.. ? రైతు-యువత ఏకమై బీఆర్ఎస్‌ను బొందపెట్టే సమయం వస్తుందని ఆగ్రహం ‍వ్యక్తం చేశారు.

‘ప్రభుత్వం పార్టీ ప్లీనరీలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో సభలు పెడుతుంది. చేతికొచ్చిన పంట ఆగమైపాయే దేవుడా కేసీఆర్ కొనకపాయే‌ ఎండకు ఎండిపాయే వానకు తడిసిపాయే చేతికొచ్చిన పంట ఆగమైపాయే ఎట్ల బతకాల్నో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటున్న రైతు.’ అంటూ రేవంత్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.


మరోవైపు అకాల వర్షాలపై  మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. అదే విధంగా వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని రైతులకు మంత్రి హరీష్‌ రావు భరోసానిచ్చారు.  సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement