సాక్షి, అమరావతి : రెండు రాష్ట్రాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలగజేశాయి. పంట చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం నేల పాలవడంతో. అన్నదాతలకు ఆవేదనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టం అంచనాను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 71,821 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. చదవండి: నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం
అత్యధికంగా 54,694 హెక్టార్లలో వరి పంట నష్టం జరగగా.. 12 వేల హెక్టార్లలో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా గోదావరి జిల్లాల్లో పంటలు నిట మునిగినట్లు అధికారుల గుర్తించారు.తూర్పుగోదావరి జిల్లాలో 29వేల హెక్టార్లలో పంట నష్టపోగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 13,900 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇక కృష్ణా జిల్లాలో 12,466 హెక్టార్లు, విశాఖ జిల్లాలో 4,400 హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు. చదవండి: భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ
Comments
Please login to add a commentAdd a comment