హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్నే తెచ్చిపెట్టాయి. జిల్లాలోని సుల్తానాబాద్, ఓదేలు మండలాల్లో ఆకాల వర్షాలతో భారీగా ధాన్యం తడిసిపోయింది. ఐకేపి, సహాకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యానికి మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.