శాంసంగ్‌ పే యాప్‌ లాంచ్‌ | Samsung Pay officially launched in India – Know how it works | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ పే యాప్‌ లాంచ్‌

Published Wed, Mar 22 2017 3:13 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

శాంసంగ్‌ పే యాప్‌ లాంచ్‌

శాంసంగ్‌ పే యాప్‌ లాంచ్‌

న్యూఢిల్లీ: సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్‌ ఇండియా  తన మొబైల్‌ వాలెట్‌ పేమెంట్‌ యాప్‌ను  భారత దేశంలో అధికారికంగా  లాంచ్‌ చేసింది. బీమ్‌, పేటీఎం లాంటి ఆప్‌ల తరహాలోనే  శాంసంగ్‌ పే ఆప్‌ సేవలను  బుధవారం ప్రారంభించింది.   డీమానిటేజేషన​ తరువాత డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యం పెరగడంతో ఇప్పటికే విదేశాల్లో  ఉన్న ఈ పే ఫీచర్‌ను  ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది.  రిజిస్టర్డ్‌ కస్లమర్లకోసం శాంసంగ్‌ పే  సేవలను ప్రారంభించింది. అయితే హై ఎండ్‌ శాంసంగ్‌  స్మార్ట్‌ఫోన్లలో  మాత్రమే ఈ యాప్‌ పనిచేస్తుంది.  

శాంసంగ్‌ పే ద్వారా డబ్బులు చెల్లించడానికి పాస్‌వర్డ్‌, ఓటీపీ అవసరం లేదట. కేవలం పే అండ్‌ గో బటన్స్‌ద్వారా సులువుగా  చెల్లింపులు చేయవచ్చు.  మాగ్నటిక్‌ సెక్యూర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆధారంగా ఈ యాప్‌  పనిచేస్తుంది.  గెలాక్సీ నోట్‌ 5, గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 అంచు, గెలాక్సీఎస్‌6 ఎడ్జ్ + గెలాక్సీ జవాబు 7 (2017), గెలాక్సీ ఏ5 (2017), గెలాక్సీ ఏ 7 (2016), గెలాక్సీ ఏ5 (2016) మొబైల్స్‌కు మాత్రమె ఈ ఆప్‌ పని చేస్తుంది.

యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు చెల్లింపు కార్డులద్వారా చెల్లింపులు  చేయవచ్చు.  అయితే, ఎస్‌బీఐకు సంబంధించి కేవలం క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే అవకాశం. ఇప్పటికే ఈయాప్‌ దక్షిణ కొరియా, అమెరికా, చైనా, స్పెయిన్, సింగపూర్, ఆస్ట్రేలియా, ప్యూర్టో రికో, బ్రెజిల్, రష్యా, థాయిలాండ్, మలేసియా సహా 12 అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement