ముంబై: ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థ గో డిజిట్ తాజాగా వాహన బీమా పాలసీలకు సంబంధించి ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్–ఆన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తక్కువగా డ్రైవింగ్ చేసే కస్టమర్లు ఈ యాడ్–ఆన్‌తో తక్కువ ప్రీమియం చెల్లించే వీలుంటుందని సంస్థ తెలిపింది. షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పట్నుంచి సగటున సంవత్సరానికి 10,000 కిలోమీటర్ల కంటే తక్కువ డ్రైవింగ్ చేసే వారు ఎవరికైనా ఈ డిస్కౌంటు వర్తిస్తుందని పేర్కొంది.
ఓడోమీటర్ రీడింగ్, టెలీమాటిక్స్ డేటా అలాగే వార్షిక కిలోమీటర్లు మొదలైన వివరాల ఆధారంగా డిస్కౌంటును డిజిట్ లెక్కిస్తుంది. ఓన్ డ్యామేజీ ప్రీమియంలో గరిష్టంగా 25 శాతం వరకూ డిస్కౌంటు పొందవచ్చు. టెక్నాలజీ ఆధారిత వీడియో ప్రీ ఇన్‌స్పెక్షన్ తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే పాలసీ జారీ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. కారును తక్కువగానే వినియోగిస్తున్నప్పటికీ .. ఎక్కువగా వినియోగించేవారితో సమానంగా అధిక ప్రీమియంలు చెల్లించే వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment