రోడ్డున పడిన నిండు గర్భిణి... కనికరం చూపని అంబులెన్స్‌ డ్రైవర్‌: వీడియో వైరల్‌ | Viral Video: UP Ambulance Driver Left Pregnant Woman On Road | Sakshi
Sakshi News home page

Viral Video: రోడ్డున పడిన నిండు గర్భిణి... కనికరం చూపని అంబులెన్స్‌ డ్రైవర్‌

Published Tue, Sep 6 2022 9:00 PM | Last Updated on Tue, Sep 6 2022 9:24 PM

Viral Video: UP Ambulance Driver Left Pregnant Woman On Road  - Sakshi

లక్నో: నడిరోడ్డుపై నిండు చూలాల్ని వదిలి వెళ్లిపోయాడు ఒక అంబులైన్స్‌ డ్రైవర్‌. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఆ గర్భిణి కుటుంబం అంబులెన్స్‌ డ్రైవర్‌ అడిగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో అమానుషంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనను జర్నలిస్ట్‌ రాజేష్‌ సాహు వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.... ఉత్తరప్రదేశ్‌లోని అంబులెన్స్‌ కంపెనీలకు వారి డ్రైవర్ల వైఖరి గురించి తెలియదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టాడు.

సదరు మహిళ హమీర్‌పూర్‌లోని పండరి గ్రామానికి చెందిన మహిళ అని,  ఆమె కుటుంబాన్ని రూ 1000 ఇవ్వాల్సిందిగా అంబులైన్స్‌ డ్రైవర్‌ డిమాండ్‌ చేశాడని వివరించాడు. బాధిత మహిళ కుటుంబం ఇవ్వలేక పోవడంతోనే గర్భిణి రోడ్డున పడిందని ట్విట్టర్‌లో తెలిపాడు. దీంతో నెటిజన్లు సదరు అంబులెన్స్‌ డ్రైవర్‌ని శిక్షించాలని ఒకరు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్‌ తీసుకుని సదరు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ మరొకరు కామెంట్లు చేస్తూ... ట్వీట్‌ చేశారు.

(చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement