
టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టెలికం శాఖ మదింపు ప్రకారం గతంలో టాటా గ్రూపు అందించిన టెలికం సేవలపై బకాయిలు రూ.14,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, టాటా గ్రూపు రూ.2,197 కోట్ల వరకు చెల్లింపులు చేసింది. వాస్తవ బకాయిలు ఈ మేరకేనని స్పష్టం చేసింది. దీంతో టాటా మదింపును ప్రశ్నిస్తూ.. పూర్తి బకాయిల చెల్లింపును కోరుతూ టెలికం శాఖ మరో నోటీసును జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికం మంత్రితో చంద్రశేఖరన్ భేటీ కావడం ప్రాధాన్యం నెలకొంది. 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రశేఖరన్ స్పందించకుండానే వెళ్లిపోయారు.
చదవండి : టెలికంలో అసాధారణ సంక్షోభం
Comments
Please login to add a commentAdd a comment