
దేశంలోని అతిపెద్ద వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాసన్స్ గ్రూపు చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ తిరిగి నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ 25న జరిగిన షేర్‌హోల్డర్ల సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరోసారి టాటాసన్స్ గ్రూపు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో విజయ్ సింగ్, లియో పూరీలకు బోర్డులో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు.
గతేడాది టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రేశేఖరన్‌కు వార్షిక వేతనంగా రూ.91 కోట్లు చెల్లించారు. వేతనంతో పాటు లాభాల్లో వాటా, ఇతర అలవెన్సులు అందించారు. ఎన్ చంద్రశేఖరన్ పనితీరు నచ్చడంతో 2022 ఫిబ్రవరిలో మరో ఏడాది పాటు అతన్నే చైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వాటాదారులతో 2022 ఏప్రిల్ 25న సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రశేఖరన్‌కు అనుకూలంగా టాటాలు ఓటేశారు.
తాజాగా జరిగిన టాటా వాటాదారుల సమావేవానికి మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. టాటా గ్రూపులో మిస్త్రీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. 2016లో మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించారు. దీనిపై మిస్త్రీ కుటుంబం న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తోంది.
చదవండి: టాటా ఎలక్సీ డివిడెండ్ రూ. 42.5