కరోనా కాలంలో తగ్గించిన తమ జీతాలను మళ్లీ పెంచాలంటూ ఎయిర్‌ఇండియా పైలెట్లు ఈ సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అప్పుడు పైలెట్ల జీతాల్లో 55 శాతం కోత పెట్టారు. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగినా జీతాలు పెంచలేదు సరికదా వివిధ రకాల అలవెన్సులకు కోత పెట్టారు.
ఇటీవల ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా సన్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోవిడ్ అనంతర పరిస్థితులు చక్కబడుతుండటంతో క్రమంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి. దీంతో కోవిడ్ సమయంలో తగ్గించిన జీతాలతో పాటు నిలిపివేసిన పలు అలవెన్సులు పునరుద్ధరించాలంటూ పైలెట్లు కొత్త చైర్మన్‌ను డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ హయంలోనూ ఇదే డిమాండ్లు వినిపించామని అయితే అప్పుల పేరు చెప్పి ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపలేదని పైలెట్ల సంఘం అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment