ట్రంప్ ముప్పు ఆ టెక్ దిగ్గజానికి లేదట | TCS chairman N Chandrasekaran downplays threat of Donald Trump to business | Sakshi
Sakshi News home page

ట్రంప్ ముప్పు ఆ టెక్ దిగ్గజానికి లేదట

Published Fri, Jun 16 2017 7:31 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ట్రంప్ ముప్పు ఆ టెక్ దిగ్గజానికి లేదట - Sakshi

ట్రంప్ ముప్పు ఆ టెక్ దిగ్గజానికి లేదట

ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వ్యాపారాలకు విఘాతం కల్గిస్తున్నారంటూ విప్రో సంస్థ బహిరంగంగా ప్రకటన చేస్తే, దీనికి భిన్నంగా దేశీయ అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రకటన చేసింది. ట్రంప్ భయాందోళలను టీసీఎస్ కొట్టిపారేస్తోంది. ట్రంప్ భయంతో వీసాల విషయంలో దేశీయ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతిదారు ఎలాంటి మార్పులను చేపట్టలేదని, అమెరికా మార్కెట్ తో సహా అన్ని మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా వ్యాపారాలను కొనసాగిస్తుందని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ప్రతి మార్కెట్లో తాము రిక్రూట్ మెంట్ చేపడుతున్నామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
 
నేడు జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో  ట్రంప్ భయాందోళనలను తగ్గిస్తూ టీసీఎస్ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. టీసీఎస్ కార్యకలాపాలు సాగించే ప్రతి దేశంలోని స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని, ఆ దేశ మార్కెట్లలో టాప్ రిక్రూటర్ గా తమ కంపెనీనే ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రాకముందే అమెరికా వీసా దరఖాస్తులను టీసీఎస్  తగ్గించిందని తెలిసింది. టీసీఎస్ కొత్త సీఈవోగా రాజేష్ గోపినాథన్ పదవి బాధ్యతలు స్వీకరించాక, గతేడాది  కంపెనీ గ్లోబల్ గా 79వేలమందిని నియమించుకుంది. వీరిలో 11,500 మంది విదేశీ మార్కెట్లలో నియమించుకుంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement