
టాటా మోటార్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇటీవలే ఎంపికైన ఎన్ చంద్రశేఖరన్ తాజాగా టాటా మోటార్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. అదనపు డైరెక్టర్‌గా, బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో అంతంతమాత్రం పనితీరుతో సతమతమవుతున్న టాటా మోటార్స్‌ను చీఫ్ హోదాలో చంద్రశేఖరన్ మళ్లీ గాడిలో పెట్టాల్సి ఉంది. అలాగే చిన్న కారు నానోపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రీమియం ఎస్‌యూవీ బ్రాండ్ హెక్సాను బుధవారం ఆవిష్కరించనుంది.