వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన
Published Wed, Sep 28 2016 10:27 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్‌నాగారం:
జీఎస్టీ చట్టం ప్రకారం ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో ఉద్యోగులకు, రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ డిప్యూటీ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఎస్టీ చట్టం అమలైతే వస్తు సేవలపై పన్ను అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోతుందని డిప్యూటీ కమిషనర్ లావణ్య తెలిపారు. ఈ విషయంలో సేవలపై పన్ను వసూలు చేసే అనుభవం రాష్ట్రాలకు లేదంటూనే వ్యాట్ సంబంధిత పన్నులను కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని యత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వస్తు సేవల పన్నులో రాష్ట్ర ప్రభుత్వలకు కూడా సమాన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్లు లక్ష్మయ్య, నిజామాబాద్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి శంకర్, ప్రతినిధులు గంగాధర్, గంగాధర్, చిస్తేశ్వర్, నాయనర్, బాలరాజు, హమీద్ అహ్మద్, భారతి, జయంత్‌నాథ్, ఆదిత్యకుమార్, విజయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement