బాన్సువాడ బీడీ వర్కర్స్ కాలనీలో పూర్తయిన మొదటి విడత ఇళ్లు
బాన్సువాడ : డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులతో పాటు ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. నిరుపేదలు, బిల్డర్లపై జీఎస్టీ పెనుభారం మోపింది. అసలే, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావ డం లేదు. వారిని ఎమ్మెల్యేలు ఒప్పించి పనులు చేయాలని కోరుతుండడంతో వారు పనులకు అంగీకరించి టెండర్లలో పాల్గొంటున్నారు. అయి తే, గతేడాది జూలై 31 నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకూ జీఎస్టీ విధిస్తుండడంతో నిధుల్లో కోత విధిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడగ గదుల ఇళ్లకు ఉమ్మడి జిల్లాలో జీఎస్టీ సెగ తగులుతోంది. కేంద్ర ప్రభు త్వం గతేడాది తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వీటిపై కూడా పడడంతో కాం ట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు 9400, కామారెడ్డి జిల్లాకు 7,052 బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో కాంట్రాక్టర్లు పనులను చేపట్టారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదు.
మొదటి విడతలో మినహాయింపు
ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.04 లక్షలు వెచ్చించడంతో పాటు ఉచితంగా ఇసుక, రూ.230కే సిమెంట్ బస్తాలు సరఫరా చేస్తోంది. మొదటి విడత పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మొత్తం రూ.5.04లక్షల చొప్పున పంచాయతీరాజ్ శాఖ చెల్లించింది. అయితే, రెండవ విడత నిధుల్లో జీఎస్టీ రూపంలో మొత్తం నిధుల నుంచి 12 శాతం కోత విధిస్తోంది. మొదటి విడతలో మంజూరైన ఇళ్లల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.04 లక్షలు, మౌలిక వసతులకు మరో రూ.1.25 లక్షలు మంజూరు చేశారు.
అయితే, కేంద్ర ప్రభు త్వం విధించిన జీఎస్టీ పోటుతో కాంట్రాక్టర్లు బెం బేలెత్తుతున్నారు. గతేడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించారు. గతంలో ఇల్లు మం జూరైతే వ్యాట్, ట్యాక్స్ కలిపి బిల్లు చేసి మినహాయించుకొనే వారు. దీంతో కాంట్రాక్టర్లంపై భారం పడేది కాదు.
అలాగే, లబ్ధిదారుడికి ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం జీఎస్టీతో లబ్ధిదారుడికి మంజూరైన యూనిట్ డబ్బుల నుంచే జీఎస్టీ రూపంలో సుమారు రూ.60 వేల వరకు మినహాయించుకొంటున్నారు. ఈ లెక్కన ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు మంజూరైతే, అందులో సుమారు రూ.60 వేలు జీఎస్టీ కింద మినహాయించుకుని మిగతాది చెల్లిస్తున్నారు.
దీంతో రూ.4.44 లక్షలతో ఇల్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంటికి అన్ని హంగులు కావాలంటే డబ్బులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ విలువతో పాటు జీఎస్టీ సొమ్మును అదనంగా మంజూరు చేసిన పక్షంలో తమపై భారం పడదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
జీఎస్టీ నుంచి మినహాయించాలి
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిరుపేదలే ఇళ్లు నిర్మించుకొంటారని, వారిపై జీఎస్టీ భారం వేయడం వల్ల అదనంగా మరో రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. లేకుంటే అర్ధాంతరంగా పనులను నిలిపి వేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
నిధులను పెంచాలి..
ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రశంసనీయం. జీవితంలో ఇల్లు నిర్మించుకోలేమనుకున్న సందర్భంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో మాకు డబుల్ బెడ్రూం మంజూరైంది. అయితే, రూ.5.04 లక్షల ని«ధుల్లో జీఎస్టీ రూపంలో కోత విధిస్తుండడంతో మేము మరో రూ.60 వేలు కట్టాల్సి వస్తున్నది. డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులను పెంచాలి.
-ముఖ్తార్, లబ్ధిదారుడు
Comments
Please login to add a commentAdd a comment