స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత | CM Kcr visits Assembly Speaker Madhusudanachary in NIMS Hospital | Sakshi
Sakshi News home page

స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత

Published Wed, Jun 3 2015 2:20 AM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM

స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత - Sakshi

స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత

నిమ్స్‌లో చికిత్స.. పరామర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వడదెబ్బతో మంగళవారం స్వల్ప అస్వస్థతకు గుర య్యారు. చికిత్స కోసం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఆయనకు బీపీ, సుగర్ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. డీహైడ్రేషన్ వల్ల కొంత నీరసంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి మధుసూదనాచారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement