తాగుబోతుల వీరంగానికి బలైన రమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది.
తాగుబోతుల వీరంగానికి బలైన రమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 12 లక్షల చెక్కును బుధవారం శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి అందజేశారు. మద్యం మత్తులో మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. దయచేసి ఎవరూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.