సాంస్కృతిక సారథుల పాత్ర కీలకం
హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణానికి సాంస్కృతిక సార«థి కళాకా రులు పునాది రాళ్లు లాంటి వారని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో సారథి ప్రజా చైతన్య రూపాల ప్రదర్శన వేడుకల్లో పలువురు మంత్రులతో పాటు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బంగా రు తెలంగాణ సాధనలో రాష్ట్ర సాంస్కృతిక సార«థుల పాత్ర చాలా కీలకమన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి సాధించిన విజయా లను సంస్థ కళాకారులు అద్భుతంగా ఆవిష్కరిం చారు. గడచిన రెండన్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. రెండన్నరేళ్లలోనే ఏ రాష్ట్రం చేపట్టలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి చూపామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పథకాలను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసు కుంటున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను సారథి కళాకారులు ప్రజల్లోకి తీసుకెళ్లి జాగృతం చేస్తున్న తీరును ప్రశంసించారు.
అర్హులకే పథకాలు అందాలి: హరీశ్
తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ఎలాంటి పాత్ర పోషించారో బంగారు రాష్ట్ర నిర్మాణంలోనూ అలాంటి పాత్రే పోషించాలని హరీశ్‌రావు కోరారు. ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తారని ఆకాంక్షించారు. మంత్రి అజ్మీరా చందూ లాల్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను పరిరక్షించుకుంటా మని, సీఎం కేసీఆర్‌కు కూడా కళలంటే ఎంతో ఇష్టమని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సార«థి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కేసీఆర్ ఆశయాలను, ఆకాంక్షలను వమ్ము చేయకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి సాంస్కృతిక సారథి తీసుకెళ్తుందని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలుగు వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సీఎం కార్యాలయం ప్రజా సంబంధాల అధికారి రమేశ్ హజారీ, తెలంగాణ రీసోర్స్ సెంటర్ డైరెక్టర్ బండి సాయన్న, తెలంగాణ సాంస్కృతిక సార«థి రచయితల కో–ఆర్డినేటర్ యశ్‌పాల్, ప్రజా సంబంధాల అధికారి విద్యానందాచారి తదితరులు పాల్గొన్నారు.