తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా వేములవాడకు ఆయన చేరుకున్నారు. అనంతరం వేమువాడలో కొలువైన రాజన్న స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్పీకర్‌కు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఇటీవలే ఆయన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.