సాక్షి, హైదరాబాద్: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే వి.అనిత (పాయకరావుపేట) సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావును కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన తొమ్మిది మంది సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ జాబితాలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొడాలి నాని, పి. అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బి. ముత్యాలనాయుడు, ఆర్‌కే రోజా ఉన్నారు. ఇదిలాఉంచితే రోజా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను సభామందిరంలోకి తీసుకెళ్లి ఫొటోలు దిగారని, ఆమెపై తక్షణమే చర్య తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
‘ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి’
Published Wed, Mar 25 2015 2:47 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM
Advertisement
Advertisement