ఢిల్లీ: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారంటూ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల మహారాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో బీసీ కోటాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. స్పీకర్‌ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాధవ్ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. అనంతరం ఆయన క్యాబిన్‌లోకి వెళ్లి స్పీకర్‌ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment