
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. స్పీకర్ పోడియం వద్ద దారుణంగా ప్రవర్తించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పట్ల టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరిస్తూ.. పేపర్లు చించివేసి ఆయనపై విసిరారు. సభ ప్రారంభం నుంచి కూడా టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు.
చదవండి: AP: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్
అసెంబ్లీలో స్పీకర్ పట్ల టీడీపీ అనుచితంగా ప్రవర్తించిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాద్ధాంతం చేశారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు టీడీపీ ఆటంకం కలిగించిందన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమన్నా... స్పీకర్‌పై టీడీపీ సభ్యులు కాగితాలు విసిరారన్నారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తను ఖండిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై డిప్యూటీ సీఎం వెళ్లి పరిశీలన చేశారన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై బాధిత కుటుంబం ఎక్కడా ఆందోళన చేయలేదని పేర్కొన్నారు. సభలో వాస్తవాలను స్పష్టంగా ప్రకటన చేస్తామని మంత్రి బొత్స తెలిపారు.