
డెహ్రాడూన్: బీజేపీ సీనియర్ నాయకుడు హర్బన్స్ కపూర్ (75) ఆదివారం కన్నుమూశారు. డెహ్రాడూన్ నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2007 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. కపూర్ మృతిపట్ల ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మితభాషిగా పేరున్న కపూర్ ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించేవాడని సీఎం పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత ఎదిగినా ఆయన నిరాడంబరంగా బతికారని గుర్తు చేసుకున్నారు. కపూర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోది సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సేవతో కపూర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
Saddened by the passing away of our senior Party colleague from Uttarakhand Shri Harbans Kapoor Ji. A veteran legislator and administrator, he will be remembered for his contributions to public service and social welfare. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 13, 2021
(చదవండి: ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు హెల్ప్‌లైన్)
Comments
Please login to add a commentAdd a comment