ఉత్తరాఖండ్ సీఎం ధామికి సుప్రీంకోర్టు చురకలు
న్యూఢిల్లీ: ప్రభుత్వాధినేతల రాజుల్లా ప్రవర్తించకూడదని, మనం పెత్తందారీ వ్యవస్థలో లేమని సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అటవీ మంత్రి, అధికారుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని రాజాజీ టైగర్ రిజర్వు డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీని నిలదీసింది. ‘‘ఆయన్ను నియమించొద్దంటూ ప్రత్యేక నోట్ ఉంది. దాన్ని డిప్యూటీ సెక్రటరీ నుంచి మంత్రి దాకా అంతా ఆమోదించారు.
అయినా సీఎం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు?’’ అని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘సీఎం అయినంత మాత్రాన ఏదైనా చేసేయగలరా? ఒక అధికారిపై ఎందుకంత మమకారం? ’’ అంటూ నిలదీసింది. రాహుల్‌పై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. రాహుల్ నియామక ఉత్తర్వులను ఈ నెల 3నే ఉపసంహరించుకున్నామని ఉత్తరాఖండ్ సర్కారు కోర్టుకు విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment