
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి రోజు సభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. స్పీకర్‌గా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని, టీడీపీ ఎమ్మెల్యేలు గెలవాలని పేర్కొన్నారు. టీడీపీ పాలన గొప్పగా ఉందని కితాబిచ్చారు. తాను నిష్పక్షపాతంగా సభను నడపడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై సమాధానం దాటవేశారు.
సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. తటస్థంగా వ్యవహరించాల్సిన స్పీకర్ రాజకీయ ఉపన్యాసం చేయడం ఏంటని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నాయి.
అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆరు రోజులపాటు సాగిన చివరి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. మొత్తం 38 గంటల 13 నిమిషాలు పాటు సమావేశాలు జరిగాయి. 20 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment