కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.