హైదరాబాద్: టీఆర్ఎస్, టీడీపీలు పట్టింపులకు పోకుండా సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి, బీజేఎల్పీ నేత కె. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించుకుని ఆ తర్వాత స్పందిస్తామని మంత్రులు హరీష్రావు, ఈటెల తెలిపారు. మంత్రి కేటీఆర్పై తామిచ్చిన ప్రివిలేజ్ మోషన్పై స్పందించాల్సిందేనని ప్రభుత్వాన్ని టీటీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
అంతకుమందు అసెంబ్లీ 10 నిముషాలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న ప్రతిష్టంభనను తొలగించాలని స్పీకర్ మధుసూధనాచారీకి విజ్ఞప్తి చేసేందుకు ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జానారెడ్డి, ఎర్రబెల్లి, లక్ష్మణ్, మంత్రి హరీష్రావులు పాల్గొన్నారు.