న్యూఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ !
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్గా రాంనివాస్ గోయల్ను ఆప్ పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే డిఫ్యూటీ స్పీకర్ పదవికి బంధనా కుమారికి కట్టబెట్టాలని నిర్ణయించారు. రాంనివాస్ గోయల్ షహద్రా, బంధనా కుమారి షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైయ్యారు. ఫిబ్రవరి 14న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా రామలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆ దిశగా ఇప్పటికే పనుల చకచకా సాగిపోతున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన 70 స్థానాలు గల హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలను ఆప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న అంశంపై కూడా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలలో ఆరవింద్ కేజ్రీవాల్ భేటీ అయి.. చర్చించిన విషయం విదితమే.