సాక్షి, అమరావతి: స్పీకర్ పదవి తనకు సవాల్ అని, ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకుందుకు ధన్యవాదాలు సభ్యులందరికీ తెలిపారు. ప్రతి సభ్యుడు శాసనసభ విలువలు కాపాడాలని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని కోరారు. శానససభలో పెద్దలు గతంలో విశిష్ట విలువలు నెలకొల్పారని గుర్తుచేశారు. కొత్త సభ్యులు మాట్లాడేందుకు సీనియర్లు అవకాశం ఇవ్వాలని సూచించారు.
వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకంపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు విశ్వాసం కల్పించాలని, అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్భోదించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. స్పీకర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. (చదవండి: స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని)
Comments
Please login to add a commentAdd a comment