Updates..
► ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
►9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ..
- అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం.
- హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు.
- నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?.
- మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి.
- గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?.
- అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.
- గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే.
మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్సీ రవీంద్రబాబు
- ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం
- మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం
- రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు
- రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది
- గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం
- అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం
- మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది
- ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం
- మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది
- ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు
►శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా హాజరైన వంశీకృష్ణ యాదవ్. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరు
మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం
- ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు,
- ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు,
- ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం
శాసన మండలి పదినిమిషాలు వాయిదా
- పెద్దల సభలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు
- చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు
- చైర్మన్ వారించినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్సీలు
- సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి
- పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు
- దీంతో, శాసన మండలి వాయిదా
- అంతకముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం
- టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన మండలి చైర్మన్
►సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం
►కాసేపు శాసనసభ వాయిదా
►అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన సీఎం జగన్
►ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ
►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం
►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
►ఈరోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
►స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు
►టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్
►టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని.
►నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించనుంది.
►ఎన్నికల నేపథ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలుపునుంది.
►అలాగే, నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది.
►పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment