AP Budget: ఏపీ బడ్జెట్‌ ప్రసంగం ఇదే.. | AP Assembly Budget Session 2024 Live Updates | Sakshi
Sakshi News home page

AP Budget: ఏపీ బడ్జెట్‌ ప్రసంగం ఇదే..

Published Wed, Feb 7 2024 6:59 AM | Last Updated on Wed, Feb 7 2024 3:13 PM

AP Assembly Budget Sessions Live Updates - Sakshi

Updates..

ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. 

►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. 

►శాసన మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌

►శాసన మండలి రేపటికి వాయిదా. 


►అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. 

రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్‌.
రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
 
ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. 
రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. 
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. 

  • మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది. 
  • ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.
  • మేనిఫెస్టోను సీఎం జగన్‌ ప్రవిత గ్రంధంగా భావించారు.  
  • ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. 

ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన 
సుపరిపాలన,
సామర్థ్య ఆంధ్ర,
మన మహిళా మహారాణుల ఆంధ్ర,
సంపన్నుల ఆంధ్ర,
సంక్షేమ ఆంధ్ర,
భూభద్ర ఆంధ్ర,
అన్నపూర్ణ ఆంధ్ర

సుపరిపాలన..

  • గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు
  • 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు. 
  • 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం
  • రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు
  • ప్రతీ జిల్లాలో దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 
  • భద్రత, మౌళిక సదుపాయాలను పెంచాం. 
  • 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు. 
  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం
  • 1000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, 
  • వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం. 
  • రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక
  • 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక
  • 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం.
  • జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు
  • గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్టు ఇది ఎక్కువ
  • సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు. 

  • ఉచితంగా విద్యార్థులకు 9.52,925 ట్యాబ్స్‌
  • 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం. 
  • రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన
  • రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన 
  • ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి
  • డ్రాప్‌ అవుట్‌ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు. 

  • విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి.
  • ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం
  • బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు.
  • నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. 
  • ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో వినూత్న కార్యక్రమం. 
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు. 

  • ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కు పెంచాం. 
  • 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి. 
  • కిడ్నీ రోగులకు కార్పొరేట్‌ స్థాయి ఉచిత వైద్యం. 
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు. 
  • జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు
  • కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు
  • 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం,.
  • ఏపీలో 192 స్కిల్‌ హబ్‌లు, 27 స్కిల్‌ కాలేజీలు 
  • నైపుణ్య శిక్షణ ద్వారా 95 శాతం మందికి ఉద్యోగాలు. 
  • విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్‌ ల్యాబ్‌లు
  • 201 పాఠశాలల్లో వర్చువల్‌ ల్యాబ్స్‌

  • అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలను మహరాణులను చేశాం. 
  • అమ్మఒడి కింద రూ.26,067కోట్లు ఖర్చు చేశాం. 
  • వైఎస్సార్‌ చేయూత కింద రూ.14,129 కోట్లు ఖర్చు. 

వ్యవసాయం రంగం..

  • జగనన్న పాలవెల్లువ కింద రూ.2697కోట్లు. 
  • 29 దిశా పోలీసు స్టేష్లను ఏర్పాటు.
  • వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ కింద 53.53 లక్షలు రైతులకు సాయం. 
  • వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ రూ.33,300 కోట్లు.
  • కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం. 
  • వైఎస్సార్‌ చేయూత కింద రూ.14,129 కోట్లు. 

  • ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. 
  • సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు. 
  • రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. 
  • వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌. 
  • వ్యవసాయ రంగం విద్యుత్‌ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ. 
  • రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. 
  • ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం. 

  • వైఎస్సార్‌ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • యంత్ర సేవల పథకం కింద రైతులకు యంత్రాలు. 
  • ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 
  • 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం. 
  • 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు. 

ఆక్వా రంగం..

  • వైఎస్సార్‌ మత్య్సకార భరోసా 2లక్షల 43వేల కుటుంబాలకు మేలు. 
  • చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4వేల నుంచి 10వేలకు పెంపు. 
  • అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్‌ హార్బర్‌లు. 
  • ఆక్వాకల్చర్‌ కింద 12వేల హెక్టార్ల విస్తీర్ణం. 
  • 16లక్షల 5వేల మందికి జీవనోపాధి. 
     

తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం

  • ఐదేళ్లలో 30.65లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. 
  • ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ. 
  • తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం. 
  • వైఎస్సార్‌ పెన్షన్‌ను మూడు వేలకు పెంచాం. 
  • 66.35లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాం. 
  • పెన్షన్లకు ఐదేళ్లలో 84731 కోట్లు ఖర్చు చేశాం. 
  • 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్‌ పంపిస్తున్నాం. 
  • వైఎస్సార్‌ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు. 
  • కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ. 
  • ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ
  • కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు పంపిణీ. 
  • నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు. 
  • జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు
  • జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు. 
  • వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు. 
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.883.5కోట్లు. 

  • బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. 
  • బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు. 

పోర్టులు, పరిశ్రమలు...

  • ఏపీ పారిశ్రామిక విధానం 2019-27ను తీసుకొచ్చాం. 
  • ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. 
  • రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం. 
  • పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి. 
  • రూ.3800 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. 
  • ఫైబర్‌ గ్రిడ్‌తో ప్రతీ గ్రామం అనుసంధానం. 
  • 55వేల కిలోమీటర్ల ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు. 
  • గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం. 

  • అవుకు రెండో టన్నెల్‌ పూర్తి. 
  • 1079కోట్లతో మూడో టన్నెల్‌. 
  • 77చెరువులతో అనుసంధాన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం
  • వర్షాలపై ఆధారపడిన రైతులకు ఎంతో మేలు. 
  • ప్రాధన్య ప్రాజెక్ట్‌ల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 
  • రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు. 
  • సుజలధార ప్రాజెక్ట్‌ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. 
  • సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం. 

  • రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం. 
  • జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది. 
  • ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరకు బంగారు బహుమతి. 
  • చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు. 
  • అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం. 
  • 311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు. 
  • మెగా పరిశ్రమల ద్వారా 1.30లక్షల మందికి ఉపాధి.
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి. 

పెట్టుబడులు..

  • సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. 
  • వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి ఆరో స్థానానికి. 
  • రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన ప్రభుత్వం మనదే. 
  • ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన
  • రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి. 
  • 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 
  • 14 ఎలక్ట్రానిక్‌ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి. 
  • 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు. 
  • 12042 ప్లాట్‌లతో ఎంఐజీ లేఅవుట్‌ల అభివృద్ధి. 
  • ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు. 
  • ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు. 
  • వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు. 

  • తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టాం. 
  • పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు. 
  • 10893 గ్రామ పంచాయతీ భవనాలు. 
  • 8299 భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలు. 
  • 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. 

ఆడుదాం ఆంధ్ర..

  • ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. 
  • విజేతలకు 12కోట్ల 21లక్షల విలువైన బహుమతులు. 
  • 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు

  • జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం. 
  • నగరతోరణం కింద పట్టణ, శివార్లలో పచ్చదనం. 
  • జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం. 
  • కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం. 
  • 17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు. 
  • నాలుగు లక్షల 80వేల మ్యుటేషన్లలకు పరిష్కారం. 

ఉద్యోగాలు..

  • ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. 
  • ఇందులో 213662 శాశ్వత నియామకాలు. 
  • 10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ. 
  • ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. 
  • డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌. 
  • 11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం. 
  • ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. 
  • పోలీసు వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 

  • 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు. 
  • గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ. 
  • డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. 
  • నాన్‌ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం.

కేబినెట్‌ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు..
►2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి.

►నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం.
►డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల.

►నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం.
►ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల.

►ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రేవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి. 

►అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం.

►ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.

►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌. 

► టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ తమ్మినేని. 

►మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

►ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు: బుగ్గన

  • సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు వచ్చారు. 
  • సీనియర్‌ నేతలు ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు

అసెంబ్లీలో మళ్లీ గందరగోళం
తీరుమార్చుకోని టీడీపీ సభ్యులు
ఈరోజు కూడా స్పీకర్‌ తమ్మినేని వెల్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు.
సభా మర్యాదలు పాటించని టీడీపీ సభ్యులు.
రెడ్‌లైన్‌ దాటి స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు. 
 

ఈరోజు కూడా పేపర్లు చింపి స్పీకర్‌పై వేసిన టీడీపీ సభ్యులు. 
సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యుల తీరు. 
స్పీకర్‌ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులు
స్పీకర్‌ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు.

 

 

►ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

►బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత

►తొలిమూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన

►ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం. 

►ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 

►సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభం

►సెక్రటేరియట్‌కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్

►కాసేపట్లో‌ కేబినెట్ సమావేశానికి హాజరు

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్

  • చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 
  • ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
  • ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం
  • ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత
  • గత ఐదేళ్ల బడ్జెట్‌లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం.

►మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్‌ ప్రతులకు పూజలు

►సెక్రటేరియట్‌కు చేరుకున్న మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు.

►సెక్రటేరియట్‌కు బయల్దేరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు

►మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధికశాఖ అధికారులు

►మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్‌కు బయల్దేరనున్న మంత్రి బుగ్గన, అధికారులు

►అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు 

►ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్ధిక శాఖ అధికారులు

►ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది.
►రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ►ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి  (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు.

►అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను చదువుతారు.
►అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement