
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభలో వీధిరౌడీలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...టీడీపీ సభ్యుల వైఖరిని ఎండగట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది. మా 151మంది ఎమ్మెల్యేలు ఓపిగ్గా ఉంటే..10మంది టీడీపీ సభ్యులు పోడియం మీదికి వస్తున్నారు. స్పీకర్ చుట్టూ గుమిగూడారు. టీడీపీ సభ్యులు స్పీకర్‌ను అగౌరపరుస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. (చదవండి: ఐయామ్ సారీ..!)
టీడీపీ ఎమ్మెల్యేలు సంస్కారం లేని వ్యక్తులు. ప్రజా సమస్యలను చర్చించడం వారికి ఇష్టం లేదు. అసలు వీళ్లు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో తెలియదు. సలహాలు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. అనవసరమైన కామెంట్లు చేస్తున్నారు. అక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే ఎలా? మళ్లీ తమపై దాడి చేస్తున్నారని అనుకూల మీడియాలో దిక్కుమాలిన వార్తలు రాస్తారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ. పోడియం రింగ్ దాటి అక్కడికి వస్తే ఎవరైనా సరే మార్సల్స్ ఎత్తుకెళ్లే విధంగా చర్యలు తీసుకోండి. వెంటనే మార్సల్స్‌ను పిలిచి రింగ్ ఏర్పాటు చేయండి. వీధి రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీలను ఏరివేయాల్సిన అవసరం ఉంది.’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఇదేమైనా మీ ఇల్లనుకుంటున్నారా; స్పీకర్ ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment