
సాక్షి, గుంటూరు : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విమర్శించారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడటం మోదీకి ఇష్టం లేదన్నారు. ఇక.. సీనియర్ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసీఆర్.. చంద్రబాబును తిడుతున్నారని మండిపడ్డారు. అసలు ఒక సీఎం మరో సీఎంని ఇలా తిట్టొచ్చా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కూడా కోడెల నోరు పారేసుకున్నారు. మోదీ, కేసీఆర్, వైఎస్ జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా రాజకీయ ఉపన్యాసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment