టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ పరిష్కరించకుండానే.. టీఆర్‌ఎస్‌లో టీడీఎల్‌పీ విలీనమైనట్లు శాసనసభ కార్యదర్శి పేరిట జారీ అయిన బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు.