![Telangana Election Results 2023 Congress lead won two seats - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/3/Congress-lead-won-two-seats.jpg.webp?itok=lMjMWClG)
సాక్షి,హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఎన్నికల కౌంటింగ్‌లో ఆదినుంచీ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. అటు ఇల్లందులో కోరం కనకయ్య 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 అభ్యర్థులు పోటీ పడ్డారు. తాజా ట్రెండ్ ప్రకారం బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు అయినట్టే కనిపిస్తోంది. దీంత తుది ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
TRS = BRS = VRS #TelanganaElectionResults
— Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023
Comments
Please login to add a commentAdd a comment