సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్‌ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్‌బీనగర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment