తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ | PM Modi Thanks To People Of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ

Published Sun, Dec 3 2023 5:03 PM | Last Updated on Sun, Dec 3 2023 5:16 PM

PM Modi Thanks To People Of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి మద్దతు తెలిపిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుబంధం నిరంతరం పెరుగుతూ ఉంటుందని ఆశించారు. తెలంగాణ ప్రజలతో తమ అనుబంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రమించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

తెలంగాణలో నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ విజయభేరి మోగించింది. బీజేపీ కూడా 8 స్థానాలను కైవసం చేసుకుంది. అటు.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ 31 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement