కేసీఆర్‌కు బై బై చెప్పండి: రాహుల్ గాంధీ  | Rahul Gandhi In Kavakurthi Public Meeting | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు బై బై చెప్పండి: రాహుల్ గాంధీ 

Published Wed, Nov 1 2023 4:13 PM | Last Updated on Wed, Nov 1 2023 4:23 PM

Rahul Gandhi In Kavakurthi Public Meeting - Sakshi

సాక్షి, కల్వకుర్తి: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ కు బై బై చెప్పాలని ​ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో బుధవారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ  సభలో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ ప్రభుత్వంలో ఆదాయం వచ్చే శాఖలన్నీ కేసీఆర్‌ కుటుంబం వద్దే ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ధరణితో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ లూటీ చేసిన ప్రతీ పైసాను కాంగ్రెస్ కక్కిస్తుందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. తాను మోదీలా మోసం చేయనని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మాటిచ్చారు.

ఇదీ చదవండి: దళిత బంధు తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement